గతంలో కాంగ్రెస్ గాలి వీచింది - ఇప్పుడు సునామీ రాబోతుంది : ఉత్తమ్ కుమార్ రెడ్డి - కేసీఆర్ పై ఉత్తమ్ కామెంట్స్
🎬 Watch Now: Feature Video
Published : Nov 18, 2023, 2:56 PM IST
Uttam Kumar Reddy Interview : కాంగ్రెస్ పార్టీపై ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. రైతుబంధు ఆపేయాలని తామెక్కడా చెప్పలేదన్న ఆయన.. బీఆర్ఎస్ పథకాలను మించి కాంగ్రెస్ అమలు చేస్తుందని చెప్పారు. ఓటమి భయంతోనే రైతు బంధు, ఇరవై నాలుగు గంటల కరెంట్ విషయంలో కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ గాలి మాత్రమే వీచిందని.. ఇకపై సునామీ రాబోతుందని అన్నారు.
Uttam Kumar Reddy Fires On KCR : హుజూర్‌నగర్, కోదాడలో యాభై వేల మెజార్టీతో గెలుస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండలో మిగిలిన ఏడు స్థానాల్లోనూ కాంగ్రెస్‌దే గెలుపు అని..మోసానికి మారు పేరుగా తయారైన కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఎంత డబ్బు ఖర్చు చేసినా.. ఈసారి ప్రజలు కేసీఆర్‌ను సాగనంపటం ఖాయమన్నారు. అన్నదాతలకు రైతుబంధుకు మించిన మేలును చేకూర్చుతామని ఉత్తమ్ కుమార్ భరోసానిచ్చారు. ఆరు గ్యారెంటీలు, మేనిఫెస్టో హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.