Civils 3rd Ranker Uma Harathi : 'ఏదో ర్యాంకు వస్తే చాలనుకున్నా.. కానీ' - యూపీఎస్సీ 2022 రిజల్ట్
🎬 Watch Now: Feature Video
Civils 3rd Ranker Uma Harathi Interview : తెలంగాణకు చెందిన ఉమా హారతి.. సివిల్స్ ఫలితాల్లో మూడో ర్యాంక్ సాధించారు. నూకల ఉమా హారతి నారాయణ పేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె. సరైన లక్ష్యం.. దానికి తగ్గ ప్రణాళిక ఉంటే సివిల్స్‌లో ఉత్తమ ర్యాంకు సాధించవచ్చని తెలిపారు. తన పట్టుదలకు కుటుంబ ప్రోత్సాహం తోడవ్వడం వల్లే ఐదో ప్రయత్నంలో తాను మూడో ర్యాంకును సాధించానని వెల్లడించారు. ఎటువంటి పరిస్థితుల్లో నిరుత్సాహానికి గురికాకుండా సన్నద్ధమయ్యానని చెప్పారు. భవిష్యత్తులో విద్యారంగం, మహిళాభివృద్ధి కోసం కృషి చేస్తానని హారతి పేర్కొన్నారు.
'ఏదో ఒక ర్యాంకు వస్తే చాలనుకున్నాను. మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. రోజూ ఏడెనిమిది గంటల పాటు చదివేదాన్ని. ముందుగా జాగ్రఫీ ఆప్షనల్ సబ్జెక్టు ఉండేది. ఆ తర్వాత ఆంత్రోపాలజీకి మారాను. ఐదేళ్లుగా నేను ప్రిపేర్ అవుతున్నాను. ఈ ప్రాసెస్‌లో కుటుంబ సభ్యుల సపోర్టు, ఎమోషనల్ సపోర్టు చాలా అవసరం. అది ఉంటే చాలు. సమాచారం, పుస్తకాలు.. అన్నీ ఆన్‌లైన్‌లో ఉచితంగా దొరుకుతాయి. కానీ ఎమోషనల్, ఫ్యామిలీ సపోర్టు మాత్రం దొరకదు కదా.. అదే చాలా అవసరం. మహిళలు, పురుషులు ఎవరైనా సరే.. కుటుంబం సపోర్టు చేస్తే సాధించవచ్చు. ఒకవేళ పరీక్షల్లో ఫెయిల్ అయినా నిరాశ పడొద్దు. ఎవరి నుంచైనా మనం స్ఫూర్తిపొందవచ్చు. నేను ఐదేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నా. ఈ పరీక్ష ప్రక్రియలో చాలా ఫెయిల్యూర్స్ చూశాను. అదే పనిగా విశ్వాసంతో చదువుతూ వెళ్లాను. నేను ఐఐటీ హైదరాబాద్‌లో సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ తర్వాత ఉద్యోగంలో చేరలేదు. సివిల్స్ వైపు వెళ్లాలని ముందునుంచీ ఉండటంతో దానిపైనే పూర్తిగా ఫోకస్ పెట్టాను. నా తల్లిదండ్రులు కూడా చాలా సపోర్టు ఇచ్చారు. సివిల్స్ సాధించే వరకు రాద్దామని నిర్ణయించుకొని రాశాను. నా ఫ్రెండ్స్ చాలా సపోర్టు చేశారు. నూటికి నూరు శాతం మా నాన్నే నాకు స్ఫూర్తి'. - నూకల ఉమా హారతి, సివిల్స్ మూడో ర్యాంకు