ఎగ్జిబిషన్లో కేంద్ర మంత్రి సందడి పకోడి వేస్తూ వ్యాపారితో ముచ్చట్లు - Gwalior Trade Fair
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ప్రారంభమైన ట్రేడ్ ఫెయిర్‌లో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సందడి చేశారు. ట్రేడ్ ఫెయిర్‌ను సందర్శించిన ఆయన.. యప్పీ గేమ్ జోన్‌కు వెళ్లి రింగ్ విసిరి కార్యకర్తల్లో జోష్ నింపారు. అంతే కాకుండా ఆ పక్కనే ఓ పకోడి దుకాణానికి వెళ్లి వ్యాపారి బాగోగులు తెలుసుకున్నారు. నూనెలో పకోడి వేసి అక్కడ వారితో ముచ్చటించారు. ఈ ట్రేడ్ ఫెయిర్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST