Minister Puvvada Cycling Video : సైకిల్‌పై వెళ్లి.. సమస్యలు తెలుసుకున్న పువ్వాడ - ఖమ్మం తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Minister Puvvada Cycling in Khammam : ప్రభుత్వ సహకారంతోనే ఖమ్మం నగరాన్ని హైదరాబాద్ తరహా సుందరంగా తీర్చి దిద్దుతున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. వీధి వీధికి పువ్వాడ కార్యక్రమంలో భాగంగా మంత్రి.. సైకిల్‌పై ఖమ్మం నగరంలో పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలపై పర్యవేక్షణ చేపట్టారు. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
గొంగలి పురుగులాగా ఉన్న ఖమ్మం నగరాన్ని సీతాకోక చిలుకలాగా మార్చామని పువ్వాడ అజయ్ తెలిపారు. నగరంలో ఉన్న పెద్ద మురుగు కాలువలను ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ కాలువలుగా మార్చి మురుగు శుద్ది కేంద్రానికి అనుసంధానం చేస్తామని వెల్లడించారు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తోడ్పాటుతోనే సాధ్యం అయ్యిందని చెప్పారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నూతన బస్టాండ్‌లో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మరుగుదొడ్లు పరిశీలించారు. దుకాణాల్లో అమ్ముతున్న తినుబండారాలను తనిఖీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం కూరగాయల మార్కెట్లో పర్యటించి చిరువ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు కాలనీల్లో తిరిగి మిషన్ భగీరథ నీరు కులాయిలు తిప్పి పని చేస్తున్నాయో లేదో చెక్ చేశారు ఆ నీటిని తాగారు. నీళ్లు సమయానికి వస్తున్నాయా లేదా కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు.