తూప్రాన్‌లో కూలిన శిక్షణ హెలికాప్టర్ - ఇద్దరు మృతి? - Training Aircraft Crashes in Toopran
🎬 Watch Now: Feature Video
Published : Dec 4, 2023, 11:16 AM IST
|Updated : Dec 4, 2023, 12:48 PM IST
Training Aircraft Crash in Toopran : ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ శిక్షణ హెలికాప్టర్ మెదక్ జిల్లాలో కూలిపోయింది. హైదరాబాద్ దుండిగల్ నుంచి బయల్దేరిన హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా భారీ శబ్దంతో, తూప్రాన్ మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో కూలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ క్రమంలోనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Plane Crashed in Medak district : మరోవైపు అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. పిలాటియస్ పీసీ 7 ఎంకేII శ్రేణి శిక్షణ విమానంగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఒకరు లేక ఇద్దరు మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నారు.