Traffic ACP Saves Man Life by CPR Viral Video : CPR​ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ ఏసీపీ.. మంత్రి హరీశ్​రావు అభినందన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 3:26 PM IST

Updated : Aug 30, 2023, 6:50 PM IST

Traffic ACP Saves Man Life by CPR Viral Video : సరైన సమయానికి స్పందించిన ఓ పోలీస్​ అధికారి.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఊపిరిపోశాడు. గుండెపోటు వచ్చిన వ్యక్తికి ట్రాఫిక్​ ఏసీపీ.. సీపీఆర్​ చేసి ప్రాణాలు రక్షించిన ఘటన బేగంపేట్​లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. సికింద్రాబాద్​లోని బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద.. రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తికి హఠాత్తుగా గుండెపోటు వచ్చి కిందపడిపోయాడు.

Traffic ACP Saves Man Life by CPR in Begumpet : అటువైపుగా వెళ్తున్న ఉత్తర మండల ట్రాఫిక్ అదనపు కమిషనర్ మధుసూదన్ రెడ్డి.. సకాలంలో స్పందించి వ్యక్తికి సీపీఆర్​ (హృదయ శ్వాస పునరుజ్జీవనం) చేసి ప్రాణాలు కాపాడారు. దాదాపు పది నిమిషాల పాటు సీపీఆర్​ చేసి హృదయ శ్వాసను మెరుగుపరిచి ప్రాథమిక చికిత్స ద్వారా ఆయన ప్రాణాన్ని రక్షించారు. అనంతరం వ్యక్తిని వెంటనే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. సకాలంలో సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఏసీపీ మధుసూదన్​ రెడ్డిని పలువురు అభినందించారు.

Minister Harish Rao Praises ACP Madhusudhan Reddy : ఈ ఘటనపై మంత్రి హరీశ్​రావు స్పందించారు. ఉత్తర మండల ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ రెడ్డిని మంత్రి అభినందించారు. కుప్పకూలిన వ్యక్తి రాముగా గుర్తించామని.. అతను ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. సీపీఆర్ చేయడం వల్ల ఇలా ఎన్నో ప్రాణాలు రక్షించవచ్చన్న హరీశ్​రావు.. ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

Last Updated : Aug 30, 2023, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.