prathidwani: కౌలు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వ తక్షణ కర్తవ్యమేంటి? - Crop loss due to untimely rains in Telangana
🎬 Watch Now: Feature Video
prathidwani: దేశానికి అన్నం పెట్టే రైతన్నకు చివరికి కన్నీరే మిగిలింది. రాష్ట్రంలో మరోసారి అకాల వర్షాలు రైతన్నలను తీవ్రంగా కుంగదీశాయి. కొద్దిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా పడిన వానలు తీరని వేదన మిగిల్చాయి. ప్రస్తుతం రైతుల పరిస్థితి.. చేతికందిన ముద్ద నోటికి అందకుండా పోయిందన్న చందంగా మారింది. పంటలు చేతికి వచ్చే సమయంలో పడిన వర్షాలతో.. పంటను ముంచేసిన విషాదంలో కోలుకోలేని రీతిలో కౌలు రైతులు దెబ్బ తిన్నారు. వడగళ్ల వానతో నష్టపోయిన వారిలో దాదాపు 40 శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎవరిని కదిలించినా కన్నీటి వ్యథలే వినిపిస్తున్నాయి. ఏం చేయాలో పాలుపోక నిస్సహాయ స్థితిలో కౌలు రైతులు నిల్చుండిపోయారు. ఈ పరిస్థితుల్లో కౌలు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? అధికార యంత్రాంగం.. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారుల తక్షణ కర్తవ్యమేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.