ఆశల పల్లకిలో కొత్త బడ్జెట్ - ఆర్థిక అవరోధాలను అధిగమించడం ఎలా? - six gurantees
🎬 Watch Now: Feature Video
Published : Jan 8, 2024, 10:18 PM IST
Today Prathidwani Debate on State Budget : ఓవైపు భారీ అంచనాలు, తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాలు. మరోవైపు అంతు దరీ తెలీని సవాళ్లు! వీటి మధ్యనే తమ తొలి పద్దుకు రేవంత్(CM Revanth reddy) సర్కారు ముమ్మర కసరత్తు చేస్తోంది. బడ్జెట్ కూర్పులో కీలకమైన ప్రతిపాదనలు పంపించాలంటూ అన్ని శాఖలకూ రాష్ట్ర ఆర్థిక విభాగం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అయితే అడ్డగోలుగా ఖర్చులు వద్దు, ఉన్నది ఉన్నట్లు జనం ముందు పెట్టండని అధికారులకు సీఎం రేవంత్ సూచనల నేపథ్యంలో ఈసారి బడ్జెట్ లెక్కలు ఎలా ఉండొచ్చు? ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక శ్వేతపత్రంలోని అవరోధాలను ఎలా అధిగమిస్తారు? రంగాల వారీగా ఎలాంటి ప్రాధాన్యాలు దక్కే అవకాశం ఉంది? అందుకు ఆర్థికంగా రాష్ట్రానికి ఉన్న అవకాశాలు ఏమిటి? పెట్టుబడుల అనుకూల వాతావరణం కోసం ఏం చేయాలి? అందుకు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.