Timmapur pond collapse in Nirmal : అధికారుల అలసత్వం.. తిమ్మాపూర్ చెరువుకు గండి - telangana rains
🎬 Watch Now: Feature Video

Timmapur cheruviki gandi : చిన్న నిర్లక్ష్యం.. పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. సరిగ్గా ఇదే నిర్లక్ష్యం.. చెరువుకట్ట మరమ్మతుల విషయంలో జరిగింది. అక్కడి అధికారుల అలసత్వం.. రైతులను నిండా ముంచింది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలతో.. భైంసా మండలంలోని తిమ్మాపూర్ పెద్ద చెరువుకు మంగళవారం సాయంత్రం గండి పడింది. పెద్ద మొత్తంలో వరదనీరంతా దిగువకు వెళ్లిపోతోంది. పంటపొలాలన్నీ ముంపునకు గురయ్యాయి.
గత సంవత్సరంలోనే కురిసిన వర్షాలతో చెరువుకట్ట తెగిపోగా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తించారు. దీంతో స్థానిక రైతులు, మత్స్యకారులు సొంతంగా ముందుకు వచ్చి.. రాళ్లు, మట్టి వేసి చెరువుకట్టకు తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు పూర్తిగా నీటితో నిండటంతో.. వరద తాకిడికి మళ్లీ కట్ట తెగిపోయి దిగువనున్న పంట చేలను ముంచెత్తింది. అధికారులు సమయానికి స్పందించి చెరువు కట్టకు మరమ్మతులు చేసుంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.