Thousands of Folk Bhajan Devotees In Yadadri : హరినామ సంకీర్తనలతో ప్రతిధ్వనించిన యాదాద్రి - Telangana folk bhajan devotees

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 4, 2023, 7:57 PM IST

Thousands of Folk Bhajan Devotees In Yadadri : అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి శ్రీ విజయ శంకర్ స్వామి ఆశీస్సులతో, జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పలు బృందాలు యాదాద్రి చేరాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన జానపద కళాకారుల అఖండ హరినామ సంకీర్తనతో యాదాద్రి నరసింహస్వామి క్షేత్రం ప్రతిధ్వనించింది. వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల బృందాల సభ్యులు ఒక్కొక్కరు చొప్పున కళారూపాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన యాదాద్రికి విచ్చేసిన భక్తులను అమితంగా ఆకట్టుకుంది. సువిశాల ఆలయ ప్రాంగణం చుట్టూ భక్త బృందాలు కోలాటాలు, నృత్యాలు, కీర్తనలు, భజనలు, యక్షా గానాలు, బోనాలతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శనలు చేశారు. పలు కళారూపాలతో 24 గంటల పాటు అఖండ హరినామ సంకీర్తన సాగుతుంది. ఈ సందర్భంగా శ్రీ విజయ శంకర స్వామి మాట్లాడుతూ.. తిరుమలలో మాదిరిగానే యాదాద్రి క్షేత్రంలో కూడా అఖండ హరినామ సంకీర్తన జరిపే అవకాశాన్ని జానపద కళాబృందాలకు కల్పించాలని ఆలయ బోర్డుకి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అఖండ హరినామ సంకీర్తనకు వచ్చే బృందాలకు తిరుమలలో మాదిరిగానే ఉచిత స్వామివారి దర్శనం, రవాణా ఛార్జీలు, భోజన, వసతి కల్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.