డబ్బుకోసం ఏకంగా బ్యాంకుకే కన్నం వేసిన దొంగ - అలారం మోగడంతో విఫలం - Bank Theft Dubbaka
🎬 Watch Now: Feature Video
Published : Jan 2, 2024, 2:22 PM IST
Theft in Indian Overseas Bank At Dubbaka : రాష్ట్రంలో దొంగలు పక్కాగా ప్రణాళికలను రచించి అందిన కాడికి దోచుకుంటున్నారు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ దొంగ ఏకంగా బ్యాంకుకే కన్నం వేశాడు. బ్యాంకులో చోరీకి విఫలయత్నం చేసిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాకలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి బ్యాంకు గేట్ తాళం పగులగొట్టి ఓ దొంగ లోపలికి ప్రవేశించాడు. దొంగ లోపలికి వెళ్లగానే బ్యాంక్ మేనేజర్ ఫోన్కు అలారం రావడంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు అలారం శబ్దంతో అలర్ట్ అయిన గ్రామస్థులు బ్యాంకు ప్రధాన ద్వారానికి తాళం వేసి దొంగను బంధించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకుని ధర్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ కిరణ్ కుమార్ పరిశీలించారు. దొంగ వెంట ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో విచారిస్తున్నారు.