రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్యలో చిక్కుకున్నా లక్కీగా.. - రైలు ప్రమాదం నుంచి బయటపడ్డ తల్లీకొడుకుల వీడియో
🎬 Watch Now: Feature Video
కర్ణాటక కలబురగి నగర్ రైల్వే స్టేషన్లో ఇద్దరు వ్యక్తులకు తృటిలో ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్లో ఫ్లై ఓవర్ ఉన్నప్పటికీ ఓ మహిళ, ఆమె కొడుకు రైల్వే ట్రాక్ మీదుగా మూడో ప్లాట్‌ఫాం నుంచి ఒకటో ప్లాట్‌ఫాంకు వచ్చేందుకు ప్రయత్నించారు. అదే సమయానికి గూడ్స్ రైలు రావటం వల్ల ఆ మహిళ ట్రాక్‌కు, ప్లాట్‌ఫాంకు మధ్య చిక్కుకుంది. దీంతో తల్లిని కాపాడేందుకు కొడుకు ప్రయత్నించాడు. తల్లీకొడుకులు ఇద్దరూ ట్రైన్ వెళ్లేంతవరకు ప్లాట్‌ఫాం గోడ పక్కేనే కూర్చుండిపోయారు. రైలు వెళ్లిన తరువాత ఇద్దరూ సురక్షితంగా ప్లాట్‌ఫాంపైకి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 6.40 గంటల సమయంలో ఈ ఘటన జరగగా.. ఓ వ్యక్తి తన మొబైల్లో ఈ వీడియో తీశాడు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST