సీఎం కేసీఆర్- హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయం : పోచారం - బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video


Published : Nov 9, 2023, 7:09 PM IST
MLA Pocharam Srinivas Reddy Interview : బాన్సువాడ పేరు వినగానే సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేరు గుర్తొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా.. తన నియోజకవర్గంలో వంద శాతం సద్వినియోగం చేసుకుంటారనే పేరుంది. వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు.. రాష్ట్రంలో సిరుల పంట పండటంతో పోచారానికి లక్ష్మీపుత్రుడిగా ముఖ్యమంత్రి బిరుదునిచ్చారు. ప్రజలకు తనపై ఉన్న అభిమానం, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే బీఆర్ఎస్కు మరోసారి అవకాశం ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. దేశంలో మరే రాష్ట్రంలో లేవని పోచారం పేర్కొన్నారు. నేడు సీఎం కేసీఆర్ పాలనలో ఆదర్శనీయ రాష్ట్రంగా తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తోందనే విధంగా మారిందన్నారు. ప్రతిపక్షాలు మాయ మాటలు చెప్పి.. ప్రజలను మోసం చేసే పనిలో పడ్డాయని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ను.. హ్యాట్రిక్ సీఎంని చేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో ముఖాముఖి.