Telangana Decade Celebrations : మల్రెడ్డి రాం రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - హైదరాబాద్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Telangana Formation Day Celebrations at LB Nagar : తెలంగాణ ఆవిర్బావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఘనంగా జరిగాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గం ఆ పార్టీ ఇంఛార్జ్ మల్రెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఆ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ చిత్రపటానికి మల్రెడ్డి.. పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నియోజక వర్గం నుంచి అధిక సంఖ్యలు కార్యకర్తలు, అభిమానులు చేరుకొని భారీ బైక్ ర్యాలీగా దిల్సుఖ్ నగర్లోని రాజీవ్ చౌక్ వద్దకు చేరుకున్నారు. అక్కడ పాలాభిషేక నిర్వహించి అనంతరం గాంధీభవన్లో జరిగే సోనియమ్మకు కృతజ్ఞతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రం మొత్తం కొట్లాడి కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే.. సీఎం కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మోసగించి ఇవాళ అధికారంలో కొనసాగుతున్నారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి శూన్యమని ఆక్షేపించారు. రూపాయి అప్పు లేని రాష్ట్రాని ఇవాళ ఐదున్నార లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు.