ప్రజాతీర్పును గౌరవిద్దాం - ఎన్నికల ఫలితాలపై త్వరలో సమీక్ష ఉంటుందన్న కేసీఆర్ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
🎬 Watch Now: Feature Video
Published : Dec 4, 2023, 8:06 PM IST
|Updated : Dec 4, 2023, 9:17 PM IST
BRS MLA's Met Former CM KCR at FarmHouse : కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలకు ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నేతలకు తెలిపారు. శాసనసభ పక్ష నేతను కూడా త్వరలో ఎన్నుకుందామని ఎమ్మెల్యేలతో పేర్కొన్నారు. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలోని ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లి ఆయనను కలిశారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో హరీష్ రావు, కేటీఆర్‌లతో పాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డితో పాటు... మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
ఈ క్రమంలో గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కేసీఆర్ ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని పార్టీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి అందచేశారు. నిన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్‌కు పంపి అక్కడి నుంచి ఫామ్ హౌస్‌కు బయల్దేరారు.