మరోసారి మొరాయించిన కేసీఆర్ హెలికాప్టర్‌, రోడ్డుమార్గంలో ఆసిఫాబాద్​కు పయనం

🎬 Watch Now: Feature Video

thumbnail

Technical Problem in CM KCR Helicopter : కాగజ్‌నగర్‌లో సీఎం కేసీఆర్‌(CM KCR) హెలికాప్టర్‌ మొరయించింది. కాగజ్‌నగర్‌లో ప్రజాఆశీర్వాద సభ అనంతరం ఆసిఫాబాద్‌లో జరిగే ప్రజాఆశీర్వాద సభకు బయల్దేరుతుండగా.. హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. దీంతో కేసీఆర్‌ ప్రచార రథమైన బస్సులోనే రోడ్డు మార్గం ద్వారా ఆసిఫాబాద్‌కు వెళ్లారు. అక్కడ బహిరంగ సభ అయిన అనంతరం బెల్లంపల్లిలో నిర్వహించే బీఆర్ఎస్‌ బహిరంగ సభలో పాల్గొనున్నారు. 

CM KCR Helicopter Stopped in KagazNagar : ఇలానే నవంబర్‌ 6వ తేదీన సాంకేతిక కారణాలతో హెలికాప్టర్‌ నిలిచిపోయింది.  ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్ర ప్రజా ఆశీర్వాద సభకు వెళ్తుండగా.. సాంకేతిక సమస్య(TECHNICAL ISSUE) రావడంతో పైలట్​ అప్రమత్తమయ్యారు. వెంటనే హెలికాప్టర్​ను వెనక్కి మళ్లించి ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో ల్యాండింగ్‌ చేశారు. దీంతో ఏవియేషన్​ సంస్థ ప్రత్యామ్నాయ హెలికాప్టర్​ను ఏర్పాటు చేసింది. మరో హెలికాప్టర్​ రాగానే కేసీఆర్ పర్యటన యధావిధిగా కొనసాగింది. ఈ హెలికాప్టర్ ఓ ప్రవేట్ సంస్థకు చెందినదిగా పార్టీ వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.