Teachers Day Celebrations At Ramadevi Public School : రమాదేవి పబ్లిక్ స్కూల్లో ఘనంగా టీచర్స్ డే - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Sep 5, 2023, 8:14 PM IST
Teachers Day Celebrations At Ramadevi Public School : రంగారెడ్ది జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు(Eenadu Editor M Nageswara Rao), రమాదేవి ట్రస్ట్ ట్రస్టీ రావి చంద్రశేఖర్లు హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి.. ఉత్తమ ఉపాధ్యాయులను ప్రోత్సాహక బహుమతులు, జ్ఞాపిక, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమానికి ముందు స్కూల్ కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్లతో పాటు ఇతర ల్యాబ్లను పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానాలతో కలిసి పరిశీలించారు.
Teachers Day Celebrations 2023 : ఈ సందర్భంగా ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని మార్చే శక్తి అమ్మ, నాన్న, ఉపాధ్యాయులకే ఉందని, గట్టి ఇటుకలతోనే గట్టి ఇల్లు నిర్మించబడుతుందని.. అలాగే మంచి పిల్లలతో మంచి జాతి తయారవుతుందని అన్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో గత 20 ఏళ్లుగా నాణ్యమైన బోధనతో ముందుకెళ్తున్న రమాదేవి పబ్లిక్ పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. దేశ నిర్మాణంలో ఉపాధ్యాయులు శక్తివంతులని వారి శక్తిని ఉపయోగించుకొని ప్రతి ఉపాధ్యాయుడు జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరారు. పాఠశాలలో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకోడానికి ఎంతోమంది ఆణిముత్యాలాంటి విద్యార్థులు వస్తారని ఆశించారు.