TDP Women Wing Bathukamma For Chandrababu : చంద్రబాబుకు మద్దతుగా బతుకమ్మలతో టీడీపీ మహిళల ర్యాలీ - TDP Women Wing
🎬 Watch Now: Feature Video
Published : Oct 19, 2023, 9:43 PM IST
TDP Women Wing Bathukamma For Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై మహిళలు బతుకమ్మ ఆడారు. అంతకుముందు బతుకమ్మలతో ట్యాంక్‌బండ్ వరకు ర్యాలీ చేపట్టారు.. అనంతరం బతుకమ్మకు చప్పట్లతో నీరాజానాలు పట్టారు. 'బతుకునిచ్చే బతుకమ్మ- బాబుగారిని దీవించమ్మా' అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు షకీలా రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి జోత్స్న, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, కాట్రగడ్డ ప్రసూన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఉండవల్లి శ్రీదేవి.. చంద్రబాబుతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధించామన్నారు. బాబు బయటకు వస్తే తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో.. ఆయన కీలక పాత్ర పోషిస్తారన్నారు. బతుకమ్మ అంటేనే బతుకునిచ్చేదని.. ఆ తల్లి చంద్రబాబుని దీవించాలని షకీలా రెడ్డి కోరారు. తమ పార్టీ అధినేత క్షేమంగా తిరిగిరావాలని.. ఆయనపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసే నిరంకుశ దాడి నుంచి విముక్తి ప్రసాదించాలని బతుకమ్మను మనసారా వేడుకుంటున్నట్లు మహిళా నేతలు తెలిపారు.