TDP Leader GV Reddy on Chandrababu Arrest జగన్ అవినీతి బురదను చంద్రబాబుకు అంటించాలనే.. అరెస్టు చేశారు : జీవి రెడ్డి - టీడీపీ ఆన్ జగన్
🎬 Watch Now: Feature Video
Published : Sep 9, 2023, 7:06 PM IST
TDP Leader GV Reddy Reacts on Chandrababu Arrest: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంటినిండా అవినీతి బురద ఉందని.. దానిని చంద్రబాబుకు అంటించాలని చూస్తున్నారంటూ టీడీపీ జాతీయఅధికార ప్రతినిధి జీవి రెడ్డి(GV Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్ వ్యక్తిగత కక్షతో రాష్ట్రాన్ని కాకుండా సొంత పార్టీని కూడా ఫణంగా పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును ఖండించిన జీవీ రెడ్డి.. స్కిల్ డెవెల్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి బడ్జెట్ లో నిధుల కేటాయింపు గురించి గతంలో శాసనసభలో చర్చించారని పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్(FIR) లో చంద్రబాబు పేరు తర్వాత చేరుస్తామంటూ అధికారులు చెప్పడాన్ని తప్పుబట్టిన జీవీ రెడ్డి.. అరెస్టు చేసే ముందు కనీస నిబంధనలు పాటించలేదని దుయ్యబట్టారు. మళ్లీ అధికారంలోకి రామన్న భయంతోనే చంద్రబాబుని ఒక్కసారైనా జైల్లో పెట్టించాలని సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. బాబుపై తప్పుడు కేసులు పెట్టి సహకరించాలని సజ్జల మాట్లాడటం హాస్యాస్పదమన్న జీవీ రెడ్డి 43వేల కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన కేసులు జగన్ పై ఉన్నాయాని, కనీసం కోడి కత్తి కేసులో కూడా జగన్ కోర్టుకు వెళ్లకపోవడంపై సజ్జల ఏం సమాధానం చెబుతారని ఆయన ఎద్దేవా చేశారు.