TDP Activists Were Brutally Treated by Police: టీడీపీ శ్రేణులపై పోలీసుల జులుం.. మహిళలు అని కూడా చూడకుండా..! - టీడీపీ కార్యకర్తలపై పోలీసుల దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 1:29 PM IST

TDP Activists Were Brutally Treated by Police: చంద్రబాబు అరెస్టుపై తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని నిరసనల కదం తొక్కాయి. నిరాహార దీక్షలు. ర్యాలీలతో చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. రోడ్లపై బైఠాయించి చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం కార్యకర్తలపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు.

Visakhapatnam.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ విశాఖ ఎంవీపీ (MVP) కాలనీలో దీక్ష చేపట్టిన తెలుగుదేశం నేతల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు. దీక్షా శిబిరాన్ని లాగి పడేసి నాయకులను ఎత్తుకెళ్లి వ్యానుల్లో పడేశారు. మహిళా నేతలను బలవంతంగా ఈడ్చెకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. పోలీసుల తీరుపై తెలుగుదేశం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే అడ్డుకోవడం, ఇష్టం వచ్చినట్లు లాక్కెళ్లడం దారుణమన్నారు. 

Prakasam District.. ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు చేయి చేసుకున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న నిరాహారదీక్షకు బయలుదేరిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు తెలుగుదేశం శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. స్థానిక ఎస్సై(SI) తెలుగుదేశం కార్యకర్త మొఖంపై బలంగా కొట్టారు. పెదం పగిలి రక్తం కారింది. పోలీసుల తీరుకు ఆగ్రహించి టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు. పార్టీ కార్యాలయం ముందు బైఠాయించి పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Eluru District.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఏలూరు జిల్లా నూజివీడులోని సంఘం కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షకు అనుమతి లేదంటూ ప్రైవేట్ స్థలంలో దీక్ష చేసుకోవాలని వారు ఏర్పాటు చేసుకున్న షామియానాను పోలీసులు తొలగించారు. టీడీపీ శ్రేణులు పోలీసులను ప్రతిఘటించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. సొంత స్థలంలోనే నిరసన కార్యక్రమం చేస్తున్నా పోలీసులు ఆటంకం కలిగిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొంతమంది టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

West Godavari District.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తుందని టీడీపీ నేత ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ శ్రేణులు సామూహిక నిరసన దీక్ష చేపట్టారు. దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో పాల్గొన్న ఆరిమిల్లి రాధాకృష్ణతోపాటు కార్యకర్తలను అరెస్టు చేశారు. శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే తమను పోలీసులు ఈడ్చిపడేసి అరెస్టు చేయడం దారుణమని రాధాకృష్ణ మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.