Tamilisai in Telangana Liberation Day Celebrations : "స్వేచ్ఛ, సమైక్యతలకు నిదర్శనం.. హైదరాబాద్ విమోచన దినోత్సవం" - తమిళిసై
🎬 Watch Now: Feature Video
Published : Sep 17, 2023, 3:14 PM IST
Tamilisai in Telangana Liberation Day Celebrations : స్వేచ్ఛా, సమైక్యతలకు హైదరాబాద్ విమోచన దినోత్సవం నిదర్శనమని.. ఈ హక్కు కోసం ఎందరో అమరవీరులు తమ ప్రాణాలను అర్పించారని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Governor Tamilisai) పేర్కొన్నారు. తెలంగాణ లిబరేషన్ డే ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో.. ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసిన గవర్నర్.. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం ప్రజలందరికీ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Governor on Telangana Liberation Day: దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వాలు, నేతలు తమ వంతు కృషి చేసినప్పటికీ.. యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ మరింతగా ప్రగతిపథంలోకి పయనించాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది రాజ్‌భవన్ తరఫున సీపీఆర్ శిక్షణపై అవగాహన కల్పించనున్నట్టు ప్రకటించారు.