బాలయ్య డైలాగ్స్​తో అదరగొట్టిన తమిళ డైరెక్టర్ - the warrior movie director Lingusamy

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 2, 2022, 4:48 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన 'ది వారియర్'. తమిళ డైరెక్టర్ లింగుసామి ఈ సినిమాకు దర్శకుడు. లింగుసామి డైరెక్ట్​గా తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా జులై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా.. అనంతరపురంలో ప్రీరిలీజ్​ ఈవెంట్​ నిర్వహించారు. మాస్​ డైరెక్టర్​ బోయపాటి శ్రీను హాజరైన ఈ కార్యక్రమంలో బాలయ్య డైలాగ్స్​తో అదరగొట్టారు లింగుసామి. 'ప్లేస్​ మారితే.. తినే ఫుడ్డు మారుతుంది.. పడుకునే బెడ్డు మారుతుంది.. బ్లడ్​ ఎందుకు మారుతుందిరా బ్లడీఫూల్'.. లాంటి డైలాగ్స్​ ఫ్యాన్స్​ను హుషారెత్తించారు. అంతేకాకుండా తాను ఇక్కడ ఉండిపోతాను అని.. తమిళనాడుకు వెళ్లనని చెప్పుకొచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.