సీఎం కేసీఆర్పై - గజ్వేల్లో చెరుకు రైతుల నామినేషన్లు - Muthyampet Sugar factory Issue
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-11-2023/640-480-19975953-thumbnail-16x9-farmers-nomination.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 8, 2023, 6:47 PM IST
Sugarcane Farmers Nomination in Gajwel : రాష్ట్రంలో మూసేసిన మూడు చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ.. కోరుట్ల చెరుకు రైతులు గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో.. రాష్ట్రంలోని చక్కెర ఫ్యాక్టరీలను పునః ప్రారంభిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయారని.. దీనిపై నిరసనగా రైతుల తరఫున.. సీఎం కేసీఆర్పై గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
Muthyampet Sugar factory Issue : రైతులకు అన్ని పంటలకు మద్ధతు ధరలను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో.. మిల్లర్లు పెద్ద మొత్తంలో తరుగు తీసుకుంటున్నారన్నారు. రైతులకు అండగా నిలిచి మిల్లర్లపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్కు ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డ్ కోసం నామినేషన్ వేశామన్నారు. అదే స్ఫూర్తితో గజ్వేల్లో నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు.