సచిన్‌కు సైకత శిల్పి స్పెషల్ విషెస్.. 50 బ్యాట్‌లను తయారుచేసి..! - సచిన్ తెందుల్కర్ సుదర్షన్ పట్నాయక్
🎬 Watch Now: Feature Video
గాడ్ ఆఫ్ క్రికెట్‌గా పేరుగాంచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్.. సోమవారం 50వ జన్నదినోత్సవం జరుపుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా సచిన్ అభిమానులు, రాజకీయ, క్రీడా ప్రముఖులు, క్రీడాభిమానుల శుభాకాంక్షలతో సామాజిక మాధ్యమాలు హోరెత్తుతున్నాయి. అయితే ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పాడు. ఏడు అడుగుల ఎత్తైన సైకత శిల్పాన్ని పూరీ సముద్ర తీరంలో తయారు చేశాడు. ఎనిమిది టన్నుల ఇసుకను ఉపయోగించి 50 ఇసుక బ్యాట్‌లను రూపొందించాడు. సచిన్ ముఖచిత్రాన్ని ఇసుకపై ఆవిష్కరించాడు. అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. "క్రికెట్ లెజెండ్ సచిన్ తెందుల్కర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఈ మైలురాయి మీకు మరింత ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తుంది. ఒడిశాలోని పూరీ బీచ్‌లో నా శాండ్‌ఆర్ట్.. మీ 50వ పుట్టినరోజు సందర్భంగా నేను 50 ఇసుక క్రికెట్ బ్యాట్‌లను సృష్టించాను. హ్యాపీ బర్త్ డే సచిన్ తెందుల్కర్" అంటూ సుదర్శన్ ట్వీట్ చేశాడు.
సచిన్ ట్వీట్ వైరల్..
సచిన్ తెందుల్కర్ ఓ ట్వీట్ చేశారు. మేడపై నుంచి దగ్గరలో ఉన్న సముద్రాన్ని చూస్తూ టీ టైమ్ 50 నాటౌట్ అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన ఆయన అభిమానులు జీవిత ప్రయాణంలో సగభాగమే పూర్తైందని.. ఇంకా ప్రయాణించాల్సిన దూరం చాలా ఉందంటూ అర్థం వచ్చేలా సచిన్ ట్వీట్ చేశారని అనుకుంటున్నారు.