Students Stuck in Flood Water Video Viral : వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులు.. జేసీబీల సాయంతో బయటకు.. వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video
Engineering Students Stuck in Flood Water : హైదరాబాద్లోని గుండ్లపోచంపల్లి మైసమ్మ గూడ వద్ద వరద నీరు భారీగా చేరింది. ఇంజినీరింగ్ హాస్టల్ విద్యార్థులు ఉంటున్న అపార్టుమెంట్ల వద్ద వరద నీరు నిలిచిపోయింది. దాదాపు 15 అపార్టుమెంట్లలో మొదటి అంతస్తును పూర్తిగా వరద నీరు ముంచింది. నీరు చుట్టుముట్టడంతో హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది.. వారిని కాపాడేందుకు రంగంలోకి దిగారు.
విద్యార్థులను కాపాడేందుకు 2 జేసీబీలతో సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. మల్లారెడ్డి, సెయింట్ పీటర్స్, నర్సింహారెడ్డి కళాశాలల హాస్టళ్ల వద్ద ఈ వర్షపు నీరు.. నడుము లోతుకు చేరడంతో.. బయటకు రాలేక విద్యార్థినులు అవస్థలు పడ్డారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థినులను ట్రాక్టర్ల ద్వారా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. వర్షాల నేపథ్యంలో మల్లారెడ్డి విద్యాసంస్థల్లోని పలు కళాశాలకు ఐదు రోజుల పాటు యాజమాన్యం సెలవు ప్రకటించింది. వసతి గృహం నుంచి విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు.