Stone Floating In Ganga River : గంగానదిలో 'రాముడి శిల'.. రామసేతు రాయి అంటున్న ప్రజలు.. భక్తిశ్రద్ధలతో పూజలు!
🎬 Watch Now: Feature Video
Published : Aug 26, 2023, 10:42 AM IST
Stone Floating In Ganga River : బిహార్ పట్నాలోని గంగా నదిలో దొరికిన ఓ రాయి.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గంగా నదిలో తేలియాడుతూ కనిపించిన ఆ రాయిపై శ్రీరామ్ అని ఉండడం వల్ల దానిని చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. రాయికి పూజలు నిర్వహిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
పట్నాలో గంగా నది రాజ్‌ఘాట్ వద్ద తేలియాడుతున్న భారీ రాయిని కొందరు స్థానికులు గమనించారు. నీటిలో భారీ రాయి తేలియాడుతుండడం వల్ల ప్రజలు కాసింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇద్దరు యువకులు.. ఈదుకుంటూ వెళ్లి రాయిని తీసుకొచ్చారు. దానిపై శ్రీరామ్ అని రాసి ఉండడం చూసి భక్తి భావనకు లోనయ్యారు.
వెంటనే రాజ్‌ఘాట్ సమీపంలోని ఓ ఆలయంలోని టబ్‌లో ఉంచి పూజలు చేశారు. అయితే ఈ రాయిని చూసేందుకు చుట్టుపక్క ప్రాంతాలతోపాటు సుదూర గ్రామాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. రాజ్ ఘాట్ పేరును రామ్ ఘాట్‌గా మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది.. అది రామసేతులోని రాయేనని అంటున్నారు.
"గంగానదిలో తేలియాడుతున్న రాయి లభ్యమైంది. వెంటనే అధికారులు ఈ రాయిపై పరిశోధన జరపాలి. రాజ్‌ఘాట్ పేరును రామ్‌ఘాట్‌గా మార్చాలి" అని ఓ స్థానికుడు డిమాండ్ చేశాడు.