ETV Bharat / state

తెలంగాణ ఏర్పాటుతో పాటు మరెన్నో - మన్మోహన్​ హయాంలో జరిగిన కీలక పరిణామాలివే! - MANMOHAN SINGH EXPIRED

సరికొత్త పథకాలకు శ్రీకారం చుట్టిన మాజీ ప్రధాని మన్మోహన్‌- దేశానికి సరికొత్త దశ, దిశ చూపిన మాజీ ప్రధాని - పెద్దగా మాట్లాడకుండానే దేశాన్ని ముందుకునడిపించిన మన్మోహన్‌

Former Prime Minister Manmohan Singh Expired
Former Prime Minister Manmohan Singh Expired (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 27, 2024, 9:31 AM IST

Updated : Dec 27, 2024, 10:26 AM IST

Former Prime Minister Manmohan Singh Expired : మన్మోహన్‌ సింగ్‌ కాస్త నెమ్మదైన మనిషే అయినా ఆయన ఆలోచనలు అమోఘం. దేశానికి సరికొత్త దశ, దిశ చూపిన ప్రధానమంత్రిగా చరిత్ర ఆయన్ను గుర్తుంచుకుంటుంది. ఎక్కడా పెద్దగా మాట్లాడకుండానే 2004 నుంచి 2014 వరకు దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు, ఉపాధి హామీ పథకం ప్రారంభం వంటి ఎన్నో కీలక పరిణామాలు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే చోటుచేసుకున్నాయి.

సంస్కరణ వాదిగానే కాకుండా పరిపాలన దక్షుడుగా ఎన్నో చరిత్రాత్మక పథకాలకు మన్మోహన్‌ శ్రీకారం చుట్టారు. మన్మోహన్‌ సింగ్‌ పాలనాకాలంలోనే దేశంలో 3జీ, 4జీ సేవల ప్రారంభంతో మొబైల్‌ సాంకేతిక విప్లవం ఊపందుకుంది. ఆధార్‌ కార్డుల జారీ మొదలైందీ ఆయన హయాంలోనే. మన్మోహన్‌ సర్కారు గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పనికి గ్యారెంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. వివిధ పథకాల కింద నగదు సాయాన్ని ఆధార్‌ అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ప్రైవేటు పాఠశాలల్లోనూ కొందరు పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించింది. సామాన్యుడి చేతికి పాశుపతాస్త్రంలాంటి సమాచార హక్కును అందించింది.

మాటల్లో కాదు చేతల్లోనే ఏదైనా - దేశాన్ని ముందుకు నడిపించిన మాజీ ప్రధానీ కన్నుమూత (ETV Bharat)

సాహసోపేత నిర్ణయం ఆయనదే : దేశంలో 3 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు రూ.72 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్‌ ప్రభుత్వానికి దక్కుతుంది. రుణమాఫీపై ఆయన సర్కారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగానే 2009లో యూపీయే వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఆ స్ఫూర్తితోనే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణమాఫీ హామీతో ఎన్నికలకు వెళ్లి గెలిచాయి. మన్మోహన్‌ హయాంలోనే విదర్భ, బుందేల్‌ఖండ్‌ ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు.

'భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయింది'- మన్మోహన్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం

అమెరికాతో అణు ఒప్పందం : భూసేకరణ చట్టాన్ని ఆధునికీకరించి ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే బాధితులకు అధిక పరిహారం, పునరావాసం అందించేలా మన్మోహన్‌ చర్యలు తీసుకున్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ఆయన హయాంలోనే అవతరించింది. తన మైనార్టీ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకొని హెచ్చరికలు జారీ చేసినా వెరవకుండా అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్న ధైర్యశాలి మన్మోహన్‌. పార్టీ అధినాయకురాలిగా సోనియాగాంధీ బలంగా ఉన్నా, నేతలంతా ఆమె కనుసన్నల్లోనే నడుచుకున్నప్పటికీ ఎక్కడా తన మాటకు విలువ తగ్గకుండా, దేశ గౌరవాన్ని తగ్గించకుండా చాకచక్యంగా ప్రధానమంత్రి పదవీ బాధ్యతలను నిర్వర్తించారు మన్మోహన్‌.

ఆయన పనితీరుకు నిదర్శనం : ప్రధానిగా మన్మోహన్‌ పదేళ్ల పదవీకాలంలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. ఆయన సర్కారుపై విమర్శలు, కుంభకోణాల ఆరోపణలు వెల్లువెత్తాయి. 2జీ, బొగ్గు, కామన్‌వెల్త్, ఆదర్శ్‌ వంటి కుంభకోణాలు ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసినా ఎవ్వరూ మన్మోహన్‌పై నేరుగా ఎవరూ వేలెత్తి చూపలేదు. 2008 నాటి ముంబయి ఉగ్రదాడి, 2012లో దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశాన్ని ఊపేశాయి. అయినా ఎవరూ మన్మోహన్‌కు నిందల్ని ఆపాదించే సాహసం చేయలేదంటే మన్మోహన్‌ పనితీరుకు నిదర్శనం.

ఆ ఘన కీర్తి ఆయనకే : తన ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ లేకున్నా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోద ముద్ర వేయించారు. అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లునూ ఉభయసభల్లో గట్టెక్కించారు. దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆయన హయాంలోనే రూపుదిద్దుకొంది. దిల్లీకి మరోవైపు జేవర్‌ ఎయిర్‌పోర్టుకూ భూసేకరణ చేపట్టి పునాదులు వేశారు. దేశ రాజధానితోపాటు చాలా నగరాల్లో మెట్రో రైలు విస్తరించారు. మన్మోహన్‌ హయాంలోనే ప్రతిభాపాటిల్‌ రాష్ట్రపతి పీఠమెక్కారు. తొలిసారి ఒక మహిళను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘన కీర్తి ఆయన సర్కారుదే.

మన్మోహన్‌ హయాంలోనే సేల్స్‌ ట్యాక్స్‌ స్థానంలో వ్యాట్‌ ప్రవేశపెట్టారు. జీఎస్‌టీ విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య సమన్వయ సాధనకు చర్యలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యసేవలకు సంబంధించిన మౌలిక వసతులు పెంపొందించడానికి నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ను ప్రారంభించింది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి జవహర్‌లాల్‌ నెహ్రూ అర్బన్‌ రెన్యూవల్‌ మిషన్‌ను ప్రారంభించి ఏడేళ్లలో 20 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు.

అవిశ్రాంత యోధుడు మన్మోహన్​- రోజుకు 18 గంటల పని- పీవీ అంచనాలను సాకారం చేస్తూ!

పదేళ్లపాటు దేశాన్నేలిన మన్మోహన్‌ సింగ్​- వైద్యుడు కావాలనుకొని!

Last Updated : Dec 27, 2024, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.