SRSP Water Level Today : ఎస్సారెస్పీలోకి మళ్లీ వరద ప్రవాహం.. 16 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల - తెలంగాణ న్యూస్
🎬 Watch Now: Feature Video
SRSP Water level in Nizamabad : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తిరిగి వరద ప్రారంభమైంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లోకి 52,548 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1,091 అడుగులకు గానూ.. 1,090 అడుగుల వరకు నీరు చేరడంతో 16 గేట్ల ద్వారా 44,448 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదే విధంగా నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 84.3190 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Special Committee Visit SRSP in Nizamabad : ఇదిలా ఉండగా.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును కేంద్ర సేఫ్టీ రివ్యూ ప్యానెల్, సేఫ్టీ ఆర్గనైజేషన్ బృందాలు ఇటీవల పరిశీలించారు. కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలోని బృందం డ్యామ్ భద్రత, రక్షణ అంశాలపై తనిఖీలు నిర్వహించారు. డ్యామ్ గ్యాలరీ స్పిల్ వే గేట్లు, సరస్వతీ కాలువ, వరద కాలువలను క్షుణ్నంగా పరిశీలించారు. ప్రాజెక్ట్ భద్రత, రక్షణ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.