యమా స్పీడ్​లో విద్యుత్​ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఒక్కసారిగా ఎగిరిపడ్డ పోల్.. డ్రైవర్​ లక్కీగా.. - bihar latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 25, 2023, 8:21 AM IST

ఓ కారు డ్రైవర్​.. అతి వేగంతో ప్రయాణిస్తూ రోడ్డుపై ఉన్న విద్యుత్​ స్తంభాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆ స్తంభం ఒక్కసారిగా ఎగిరి నేలపై పడింది. బిహార్​లోని బక్సర్​లో ఈ ఘటన జరిగింది. సీసీటీవీలో రికార్డు అయిన ఘటనా దృశ్యాలు.. ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

ఇదీ జరిగింది.. బక్సర్​లోని నగర​ పోలీస్​ స్టేషన్​ పరిథిలోని ఆమ్లా ప్రాంతంలోని ఈ ఘటన జరిగింది. అతి వేగంతో వచ్చిన ఓ కారు డ్రైవర్​.. విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఆ వేగం ధాటికి విద్యుత్​ స్తంభం.. ఒక్కసారిగా ఎగిరి నేలపై పడింది. కరెంట్​ తీగలన్నీ తెగిపోయాయి. అయితే బలంగా ఢీకొట్టిన కారు డ్రైవర్​.. ఆగకుండా అదే వేగంతో చక్కగా వెళ్లిపోయాడు. విద్యుత్​ స్తంభం ఎగిరిపడిన దృశ్యాలు చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లల్లోకి పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు రకరకాలుగా స్పందింస్తున్నారు. 'మీది కారు ఏ కంపెనీ బ్రదర్'​ అని అడుగుతున్నారు. కారుకు ఏమవ్వకపోవడం చాలా ఆశ్యర్యంగా ఉందని మరికొందరు అంటున్నారు.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నగర పోలీస్​ స్టేషన్ ఇన్‌ఛార్జ్ దినేశ్​ మలాకర్‌ స్పందించారు. ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కారు డ్రైవర్‌ గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.