Special Interview on C Vigil APP : ఎన్నికల వేళ సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం సీ-విజిల్.. ఈ విషయాలు తెలుసుకోండి..! - ఓటరు ఫిర్యాదుపై సీ విజిల్ నిఘా
🎬 Watch Now: Feature Video
Published : Oct 23, 2023, 1:08 PM IST
Special Interview on C Vigil APP : కళ్లెదురుగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే సామాన్యులు ఏం చేయలేరా అంటే.. చేయొచ్చు అంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. కోడ్ ఉల్లంఘనలు ఆడియో, వీడియో రూపంలో, జరుగుతున్న చోటి నుంచే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చని చెబుతోంది. ఫిర్యాదుదారు వివరాలను గోప్యంగా ఉంచుతూ.. సమాచారం అందిన 100 నిమిషాల్లో చర్యలు సైతం తీసుకునేందుకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. అదే సామాన్యుని చేతిలో బ్రహ్మాస్త్రం సీ-విజిల్.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్.. సీ-విజిల్ యాప్‌పై అన్ని గ్రామాల్లో గోడ పత్రికలు అంటించాలని, రాజకీయ పార్టీలు, ఓటర్ల నుంచి వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అసలు సీ-విజిల్ అంటే ఏమిటి..? దాని ద్వారా సామాన్యులు ఎలా ఫిర్యాదు చేయొచ్చు? అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారు..? ఈ నేపథ్యంలో సీ విజిల్ యాప్‌కు సంబంధించి మరిన్ని వివరాలపై మహబూబ్‌నగర్ జిల్లా సమాచార విజ్ఞాన అధికారి సత్యనారాయణ మూర్తితో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి..