Food Varieties in Mahanadu: మహానాడులో సభలు, సమావేశాలు మాత్రమే కాదు.. నోరూరించే వంటలు కూడా.. చూస్తారా..? - మహానాడులో వంటలు
🎬 Watch Now: Feature Video
Food Varieties in Mahanadu Program: సహజంగా నోరూరించే వంటకాలను చూస్తే అందరికి నోట్లో లాలాజలం ఊరుతుంది. ఇక టీడీపీ నిర్వహించే మహానాడులో తయారు చేసే వంటకాలైతే చెప్పక్కర్లేదు. యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి సన్నద్ధం అవుతోంది. శనివారం నుంచి రెండు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సుమారు 15లక్షల మంది వస్తారని టీడీపీ అంచనా వేసింది. అందుకోసం ఈ కార్యక్రమానికి తరలివచ్చే అభిమానులు, పార్టీ శ్రేణుల కోసం పసందైన వంటకాలు.. నోరూరించే రుచులను అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పలు రకాలు స్వీట్లు, నిల్వ పచ్చళ్లు, రకరకాల వంటలను సిద్ధం చేస్తున్నారు. విజయవాడకు చెందిన అంబికా క్యాటరింగ్ మహానాడు వంటకాలను సిద్దం చేస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి కృష్ణ అందిస్తారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వంటకాలను ఓ సారి చూసేయండి..