మేడ్చల్లో రూ.50 లక్షల హవాలా నగదు పట్టివేత - Telangana Election 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 7, 2023, 8:06 PM IST
SOT Police Seize Money in Medchal : ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడిక్కడే కార్లను తనిఖీలు చేస్తూ అక్రమ సొత్తు, మద్యం, విలువైన వస్తువులను స్వాధీనపరుచుకుంటున్నారు. తాజాగా దుండిగల్ పోలీసులు, బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు కలిసి జరిపిన విస్తృత తనిఖీల్లో.. దుండిగల్ పీఎస్ పరిధిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనపరచుకున్నారు.
కూకట్పల్లి నుంచి బోరంపేట్ వైపు వచ్చిన కారును ఆపి.. చెక్ చేయగా ఈ మొత్తం సొమ్ము పట్టుబడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సరైన పత్రాలు లేకపోవడంతో దొరికిన నగదును అధికారులు సీజ్ చేసినట్లు వివరించారు. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం కమిటీ ముందు డబ్బులను అప్పగించనున్నట్లు దుండిగల్ పోలీసులు తెలిపారు. డబ్బులు తరలించిన వ్యక్తులు సరైన ధ్రువపత్రాలను చూపిస్తే.. అధికారుల పరిశీలన అనంతరం నగదును తిరిగి అప్పగిస్తామని స్పష్టం చేశారు.