రామగుండంలో అకస్మిక తనిఖీలు - రూ.2.18 కోట్ల నగదు పట్టివేత - రామగుండం ఎన్టీపీసీలో రూ 2 కోట్లు స్వాధీనం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-11-2023/640-480-20125282-thumbnail-16x9-cash.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 27, 2023, 5:00 PM IST
SOT officials Seized Rs.2.18 Crore at Ramagundam NTPC : ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ కృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం. తమకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్వోటీ అధికారులు సోదాలు చేపట్టారు.
ఓ కాంట్రాక్టర్ ఇంట్లో అక్రమ నగదు ఉందని సమాచారం రావడంతో.. ఆ ఇంటి తాళం పగలగొట్టి తనిఖీలు చేశారు. ఎన్నికల్లో భాగంగా తనిఖీ చేయగా.. రూ.2 కోట్ల 18 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియలేదని.. డబ్బు ఎక్కడిదనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు చేపడుతూ.. భారీ నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అక్రమ నగదు వివరాలు తెలుపుతూ.. ఐటీ శాఖకు అప్పగిస్తున్నారు.