హిమగిరుల్లో అరుదైన మంచు చిరుతల సంచారం
🎬 Watch Now: Feature Video
హిమాచల్‌ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో అరుదైన మంచు చిరుత పులులు సంచారం చేస్తున్నాయి. హిమపాతం అధికంగా ఉండటం వల్ల అడవిలో ఉండే చిరుతలు దిగువ ప్రాంతాలకు చేరుకున్నాయి. పెంపుడు జంతువులను వేటాడుతున్నాయి. ఈ వణ్యప్రాణులను చూసి గ్రామస్థులంతా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలను చిరుతల చేతికి చిక్కకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. కొంతమంది ఈ పులులు సంచారం చేస్తున్న వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిరుతలను పట్టుకునేందుకు అధికారులు బోనులను ఏర్పాటు చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST