ఒకే ఇంట్లో 24 నాగుపాములు.. డ్రెస్సింగ్ టేబుల్ కింద మకాం.. గ్రామమంతా హడల్! - బిహార్ లేటెస్ట్ వార్తలుు
🎬 Watch Now: Feature Video
Snakes In House : సాధారణంగా ఒక్క నాగు పామును చూస్తే మనం భయపడిపోతాం. అలాంటిది ఒకే చోట 24 నాగుపాములు కనిపిస్తే ఇంకంతే సంగతి.. ఒకటే పరుగు పెడతాం! బిహార్లోని బగహ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది.
జిల్లాలోని మధుబని గ్రామ పంచాయతీలో వార్డు నెం.5లో ఉంటున్న మదన్ చౌదరి.. తన ఇంటి మెట్ల కింద డ్రెస్సింగ్ టేబుల్ కింద ఉంచాడు. ఇంట్లోని కొందరు పిల్లలు ఆ మెట్ల దగ్గర ఆడుకుంటున్నారు. అదే సమయంలో పిల్లల పక్కనుంచే ఓ నాగు పాము వెళ్లింది. అది చూసిన చిన్నారులు గట్టిగా అరిచారు. వెంటనే ఆ అరుపులు విన్న కుటుంబసభ్యులు అక్కడి చేరుకున్నారు. ఆ తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ కింద చూడగా పాములు.. గుంపుగా ఉన్నాయి.
వెంటనే మదన్ కుటుంబసభ్యులు.. పాముల సంరక్షకుడికి సమాచారం అందించారు. అతడు వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ కింద 24 పాములు, 60 గుడ్లును రక్షించాడు. అనేక పాత్రల్లో వాటిని తీసుకుని వెళ్లి గండక్ నది ఒడ్డున విడిచిపెట్టాడు. అయితే అన్ని పాములు.. ఒకే ఇంట్లో ఉన్నాయన్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. మదన్ ఇంటికి వద్దకు చేరుకున్నారు. పాములు పడుతున్న సమయంలో ఆసక్తిగా తిలకించారు. మరికొందరు భయాందోళనకు గురయ్యారు. అయితే పాములను చూసి కొందరు మహిళలు.. శివ నామస్మరణ చేశారు.