మద్యం సీసాలో పాము పిల్ల.. ఇదేందయ్యా ఇదీ..! - మద్యంలో పాము
🎬 Watch Now: Feature Video
snake in liquor bottle: ఏపీలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తక్కువ రకాల మద్యం సరఫరా అవుతుందని ఇప్పటికే మద్యంప్రియులు వాపోతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరులోని బాపట్ల బస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో గత రాత్రి కొందరు యువకులు మద్యం సీసాను కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి అట్ట పెట్టె తెరిచి చూడగా.. మద్యం సీసాలో పాము పిల్ల ఉన్నట్టు గుర్తించారు. వెంటనే మద్యం షాప్ వద్దకు వెళ్లి దుకాణంలోని సిబ్బందిని నిలదీశారు. వేరే మద్యం సీసా ఇవ్వడానికి నిరాకరించడంతో వారితో వాదనకు దిగారు. దీంతో చేసేదిలేక సిబ్బంది.. మరో బాటిల్ ఇచ్చి వెనక్కి పంపించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST