Slight flood in SRSP : శ్రీరాం​సాగర్​ ప్రాజెక్ట్​కు స్వల్పవరద.. - Nizamabad District News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 14, 2023, 3:40 PM IST

Slight flood in Sri Ramasagar Project : ఈ ఏడాది వర్షకాలం సీజన్​లో రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి.​ ఆరంభం నుంచి వరుణుడు దోబూచులాడుతున్నాడు. అంతగా వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలోని నదుల్లో ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. చాలా వరకు రిజర్వాయర్ల​లో నీటిమట్టం పడిపోయింది. అయితే.. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు కొంతవరకు శుభపరిణామంగా మారాయి. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప వరద ప్రారంభమైంది గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ఈవరద వస్తోంది.  ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి 8515 క్యూసెక్కుల వరద వస్తోంది. పునరుజ్జీవనం పథకం ద్వారా 4109 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది ప్రస్తుతం ప్రాజెక్టులో 1067 అడుగుల నీటిమట్టంతో 75 టీఎంసీల నీటినిల్వ ఉంది. రాష్ట్రంలో వర్షభావ పరిస్థితుల దృష్ట్యా శ్రీరాం​సాగర్​ పునరుజ్జీవ పథకంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రాంపూర్, రాజేశ్వరరావుపేట, ముప్కాల్ వద్ద ఉన్న పంప్ హౌసుల్లోని నాలుగు చొప్పున మోటార్ల ద్వారా శ్రీరాంసాగర్‌లోకి నీటిని తరలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.