Singer Sai Chand Passed Away : సాయిచంద్ అకాల మరణం.. కన్నీటిపర్యంతమైన మంత్రి ప్రశాంత్​రెడ్డి - Minister Prashanth Reddy condoled Saichand death

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 29, 2023, 12:27 PM IST

Minister Prashant Reddy About Sai Chand Death : తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ హఠాన్మరణంపై వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గుర్రంగూడలోని సాయిచంద్‌ ఇంటికి చేరుకుని.. ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ క్రమంలోనే సాయిచంద్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మంత్రి ప్రశాంత్​రెడ్డి కంటతడిపెట్టారు. తమ్ముడు సాయిచంద్ లేడని ఊహించుకుంటేనే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే సాయిచంద్ మరణం దురదృష్టకరమని అన్నారు. ఆయన పాడిన పాటలు ఖండాంతరాలు దాటాయని చెప్పారు. తన మనసుకు దగ్గరైన వ్యక్తి.. తమ్ముడు సాయిచంద్ అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ప్రశాంత్​రెడ్డి తెలిపారు.

సాయిచంద్‌ మృతదేహానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులర్పించారు. సాయిచంద్ తన మాటల పాటలతో బీఆర్ఎస్ సభలను విజయవంతం చేశారని.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆయన మరణం అందరినీ తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమని అన్నారు. ఈరోజు మధ్యాహ్నం వనస్థలిపురం సాహెబ్​నగర్ స్మశానవాటికలో అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహిస్తారని బాల్క సుమన్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.