సొంతూరోళ్లతో సీఎం జానపద నృత్యం- స్టెప్పులు అదరగొట్టేశారుగా! - కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జానపద నృత్యం
🎬 Watch Now: Feature Video
Published : Nov 3, 2023, 7:41 AM IST
Siddaramaiah Dance Viral Video : ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. తన డ్యాన్స్‌తో అలరించారు. తన సొంతూరికి చెందిన కళాకారులతో జానపద గీతానికి నృత్యం చేసి సందడి చేశారు. కర్ణాటకలోని హంపిలో జరిగిన 'కర్ణాటక సంభ్రమం-50' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జానపద నృత్యం చేశారు.
విజయనగర జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హంపిలో కన్నడ సాంస్కృతిక శాఖ.. 'కర్ణాటక సంభ్రమం-50' పేరుతో ఏడాది పొడవునా కన్నడ రాజ్యోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య గురువారం.. కరుణాదయ జ్యోతి రథయాత్రను ప్రారంభించారు. ఆ సమయంలో సిద్ధరామయ్య స్వగ్రామమైన సిద్ధరామనహుండికి చెందిన పలువురు కళాకారులు.. వీర మక్కల కుణిత జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. కళాకారుల కోరిక మేరకు సిద్ధరామయ్య కూడా వాళ్లతో డ్యాన్స్ చేశారు.
Siddaramaiah Folk Dance : జానపద పాటకు అనుగుణంగా కళాకారులతో కలిసి స్టెప్పులు వేసి సిద్ధరామయ్య అలరించారు. గాలిలో చేతులు కదుపుతూ డ్యాన్స్ వేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు, కార్యకర్తలు, నాయకులు.. సిద్ధరామయ్య డ్యాన్స్ వేస్తుండగా చప్పట్లతో హోరెత్తించారు. ఈలలు వేస్తూ ఆయనను ఉత్సాహపరించారు.