DTH​ రీఛార్జ్​ కాలేదని దారుణం- షాపు యజమానిపై పిడిగుద్దుల వర్షం, ముగ్గురు యువకులు అరెస్ట్ - ఫతేహాబాద్ క్రైమ్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 12:37 PM IST

Shopkeeper Beaten Video : డీటీహెచ్​ రీఛార్జ్​ కాలేదని షాపు యజమానిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు ముగ్గురు యువకులు. కొట్టుకుంటూ షాపు యజమానిని బయటకు లాక్కెళ్లారు. అనంతరం షాపును ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు షాపులోని సీసీటీవీలో రికార్డయ్యాయి. దుకాణదారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన హరియాణాలోని ఫతేహాబాద్​ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
చాంద్​పురా గ్రామానికి  చెందిన ముగ్గురు యువకులు జఖాల్ ప్రాంతంలో ఉన్న ఓ షాపునకు వెళ్లి డీటీహెచ్​ రీఛార్జ్ చేయించారు. అయితే ఆ డీటీహెచ్​ రీఛార్జ్​ కాలేదని కోపోద్రిక్తులైన యువకులు, దుకాణాదారుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. కర్రతో షాపులోని వస్తువులను ధ్వంసం చేశారు. అనంతరం అతడిని కొట్టుకుంటూ షాపు బయటకు తీసుకెళ్లారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ ఆ షాపులో అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వీరు ఉపయోగించిన వాహనం, కర్రను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జఖాల్ పోలీస్​ స్టేషన్ ఇంఛార్జ్​ రంజిత్​ సింగ్ వివరాలు వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.