Kamareddy latest politics : హాట్ హాట్‌గా కామారెడ్డి రాజకీయాలు.. 'డబుల్' ఇళ్లపై నేతల మధ్య సవాల్లు - డబుల్ బెడ్ రూం ఇళ్లు
🎬 Watch Now: Feature Video
Shabbir Ali And MLA Gampa Govardhan Political War : కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ వద్ద నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల నాణ్యతపై అధికార విపక్ష నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లకు దిగారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేసిన సవాల్‌ను మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్వీకరించారు. రెండు పడక గదుల ఇళ్లను సందర్శించారు. ఇళ్ల నాణ్యతపై అసహనం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల్లో భారీగా అవినీతి జరిగిందని.. కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని మండిపడ్డారు. ఈనెల 7వ తేదీన మొదటి సారి డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించిన షబ్బీర్ అలీ.. నాణ్యంగా నిర్మించలేదని విమర్శించారు. ఎప్పుడు కూలిపోతాయో తెలియదని ఆరోపించారు. కాంట్రాక్టుల జేబులు నింపుకోవడానికే నిర్మించారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తిప్పికొట్టారు. కామారెడ్డి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నాణ్యతతో నిర్మించామని పేర్కొన్నారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి షబ్బీర్ అలీ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 'దమ్ముంటే ఇంజనీర్లను తీసుకొనిరా' అంటూ షబ్బీర్ అలీకి సవాల్ విసరగా.. స్వీకరించి ఇవాళ పక్కా ఇళ్ల వద్దకు చేరుకొన్నారు.