బీఎస్పీ ప్రజాఆశీర్వాద సభలో అపశృతి - 15 మందికి గాయాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2023, 4:14 PM IST

Several People Injured BSP Praja Ashirwada Sabha In Vemulawada : రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఎస్పీ ప్రజాఆశీర్వాద సభలో అపశృతి చోటు చేసుకొంది. మీటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వేములవాడ బైపాస్‌రోడ్డులో సిరిసిల్ల, వేములవాడ బీఎస్పీ అభ్యర్థులతో కలిసి ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. సభకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు రెండు నియోజకవర్గాల అభ్యర్థులు హాజరయ్యారు. భారీగా జనం తరలిరాగా..వారి కోసం పెద్ద ఎత్తున షామియానాలను ఏర్పాటు చేశారు. 

BSP Praja Ashirwada Sabha : సభ ప్రారంభమైన కొద్దిసేపటికే షామియానాలు కూలిపోవడంతో గందరగోళం నెలకొంది. సభకు హాజరైన ప్రజలు భయాందోళనకు గురై చెల్లాచెదురుగా పారిపోయే యత్నం చేశారు. షామియానాలు కూలి పలువురిపై పడటంతో.. దాదాపు 15మందికి గాయాలు కాగా.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ ప్రవీణ్‌కుమార్‌ గాయపడిన వారిని పరామర్శించారు. టెంట్లు సరిగ్గా వేయకపోవడం వల్లనే కూలిపోయాయని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.