ETV Bharat / business

పర్సనల్ లోన్ ఫస్ట్ టైమ్ తీసుకుంటున్నారా? ఇవి తెలుసుకోవడం మస్ట్!

అత్యవసర పరిస్థితుల్లో కష్టాల నుంచి కాపాడుతున్న పర్సనల్ లోన్స్- ఇవి తీసుకునేముందు తెలుసుకోవాల్సిన విషయాలు!

Personal Loan Guidelines
Personal Loan Guidelines (Source : ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : 11 hours ago

Personal Loan Guidelines : ఆర్థిక అవసరాలు ఎప్పుడు, ఏ రూపంలో వస్తాయో చెప్పలేం. కొన్నిసార్లు అవసరమైనప్పుడు మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. లేదా మన దగ్గరున్న సొమ్ము సరిపోకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది వ్యక్తిగత రుణం (Personal Loan) తీసుకుంటారు. అయితే బిగినర్స్ పర్సనల్ లోన్స్ తీసుకునే ముందు కొన్ని విషయాలను కచ్చితంగా చెక్ చేసుకోవాలి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

  • వివాహం : భారతీయులు వివాహానికి చాలా డబ్బులు ఖర్చు చేస్తారు. తమ పిల్లల పెళ్లి కోసం చాలా ఏళ్ల ముందు నుంచే డబ్బును ఆదా చేస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు అవి సరిపోవు. అలాంటప్పుడు పెళ్లి కోసం వ్యక్తిగత రుణాన్ని తీసుకున్నా నష్టం లేదు.
  • ఖరీదైన వస్తువుల కొనుగోలు : కొన్నిసార్లు మీకు ఇష్టమైనవారి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఖరీదైన కానుకలు కొనాల్సి రావొచ్చు. ఎందుకంటే వివాహ వార్షికోత్సవం, పుట్టిన రోజు వంటి వేడుకలకు ప్రస్తుతం కాలంలో గిఫ్టులు సాధారణమైపోయాయి. అలాంటప్పుడు పర్సనల్ తీసుకున్నా ఫర్వాలేదు.
  • హాలీడే ట్రిప్ : కొందరు ఫ్యామిలీతో కలిసి టూర్లు ప్లాన్ చేస్తుంటారు. సరదాగా సేదతీరడం కోసం కొన్నిరోజులు విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. అలాంటప్పుడు మీ కోరికను తీర్చుకోవడానికి పర్సనల్ లోన్ తీసుకోవచ్చు.
  • ఇంటి పునరుద్ధరణ : కొందరు ఇల్లును కట్టడానికి, పునరుద్ధరణ (Renovation) కోసం హోమ్ లోన్ తీసుకుంటారు. ఆ లోన్ డబ్బులు సరిపడనప్పుడు పర్సనల్ లోన్ కూడా తీసుకోవచ్చు.
  • ఎమర్జెన్సీ సమయంలో: పైన పేర్కొన్న కారణాలే కాకుండా, మీ కుటుంబీకులు ఎవరైనా అనారోగ్య సమస్యలు లేదా ఇతర కారణాలతో ఆస్పత్రిలో చేరినప్పుడు పర్సనల్ లోన్ వాడుకోవచ్చు. ఎమర్జెన్సీ సమయంలో వ్యక్తిగత రుణాలు ఆసరాగా నిలుస్తాయి.

రుణదాతను ఎలా ఎంచుకోవాలి?

పర్సనల్​ లోన్స్​ను ఎక్కడి నుంచి తీసుకోవాలన్నది మనమే నిర్ణయించుకోవాలి. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్​బీఎఫ్​సీలు), లోన్​ యాప్​లు పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. అందుకే ఈ మూడింటిలో ఏది ఎంచుకోవాలో తెలుసుకునేందుకు కొన్ని టిప్స్ పాటించాలి.

  • బ్యాంక్ : బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్ తీసుకోవడం కాస్త భద్రమని చెప్పాలి. అయితే ఇతర బ్యాంకుల వడ్డీ రేట్లతో సరిపోల్చుకుని లోన్ తీసుకోవడం మంచిది.
  • బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(NBFC): మీకు బ్యాంకు పర్సనల్ లోన్ ఇవ్వనప్పుడు ఎన్​బీఎఫ్​సీను సంప్రదించవచ్చు. అయితే బ్యాంకులతో పోలిస్తే ఎన్​బీఎఫ్​సీలు ఎక్కువ వడ్డీ రేటును వేస్తాయి.
  • లోన్ యాప్స్: బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలలోనే కాకుండా లోన్ యాప్స్ ద్వారా కూడా పర్సనల్ లోన్స్ పొందొచ్చు.
  • ఆర్​బీఐ గుర్తింపు : మీకు లోన్ ఇచ్చే బ్యాంకు, ఎస్​బీఎఫ్​సీ లేదా యాప్ ఆర్​బీఐ గుర్తింపు పొందిందా లేదా అనే విషయం తెలుసుకోవాలి.

EMI కాలిక్యులేటర్

చాలా మంది పర్సనల్​ లోన్​ను ఈఎంఐ రూపంలో చెల్లిస్తుంటారు. అయితే లోన్ తీసుకునేందుకు ముందే మీరు నెలవారీ చెల్లించాల్సిన మొత్తం ఎంతో ఈఎంఐ కాలిక్యులేటర్​ను ఉపయోగించి లెక్కించండి. లోన్ మొత్తం, లోన్ వ్యవధి, వడ్డీ రేటు ఆధారంగా మీరు లోన్ కోసం నెలవారీ కట్టాల్సిన మొత్తం ఎంతో తెలిసిపోతుంది.

ఊదాహరణకు మీరు రూ.10 లక్షల విలువైన పర్సనల్ లోన్ పొందారు. వడ్డీ 10 శాతం. లోన్ వ్యవధి 3ఏళ్లు. అప్పుడు మీరు నెలకు 32,267 రూపాయల ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది.

వీటి విషయంలోనూ జాగ్రత్త సుమా! అలాగే పర్సనల్​ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, రుణం ఇచ్చే సంస్థ వంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

  • వడ్డీ రేటు : మీరు లోన్ తీసుకునేముందు పలు బ్యాంకులు విధించే వడ్డీ రేట్లను ఒకసారి పరిశీలించాలి. ఆ తర్వాత ఏ బ్యాంకు తక్కువ వడ్డీ రేటుకు లోన్ ఇస్తే అందులోనే వ్యక్తిగత రుణం తీసుకోవడం మంచిది.
  • ప్రాసెసింగ్ ఫీజు : పర్సనల్ లోన్ తీసుకునేవారే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీకు లోన్ ఇచ్చే ముందు దీన్ని రుణదాతలు తీసుకుంటారు. ప్రాసెసింగ్ రుసుము ఎక్కువగా ఉంటే, మీరే వేరే బ్యాంకులో లోన్ తీసుకోవడం కోసం ఆలోచించవచ్చు.
  • అస్పష్టమైన రుణదాత నుంచి పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిది కాదు. మంచి గుర్తింపు పొందిన బ్యాంక్ లేదా ఎన్​బీఎఫ్​సీ నుంచి లోన్ తీసుకోవడం బెటర్. ఫిన్‌ టెక్ లెండింగ్ యాప్స్ ద్వారా లోన్ తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.

పర్సనల్ లోన్ తీసుకున్నా డబ్బులు​ ​సరిపోలేదా? Top-Up​ ఆప్షన్ వాడుకోండిలా!

బ్యాంకులు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా రుణం ఇవ్వడం లేదా? ఇలా చేస్తే లోన్ గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.