Belly Fat Reduction Exercises: మనలో చాలా మంది సన్నగా, నాజుగ్గా కనిపించాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం కఠిన ఆహార నియమాలు కూడా పాటిస్తారు. ఇంత చేసినా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మాత్రం చాలామందికి అలానే మిగిలిపోతుంది. మీరు అలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నారా? అయితే 10-20-30 సూత్రాన్ని ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.
బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కార్డియో వ్యాయామాలు లేదా ఏరోబిక్ వ్యాయామాలు చాలా ఉపయోగపడతాయని హార్వర్డ్ మెడికల్ పబ్లిషింగ్ అధ్యయనంలో తేలింది.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇవి కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. అలాగే హృదయ ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. కాబట్టి వారంలో కనీసం 150 నిమిషాలపాటు కొంచెం తీవ్రత కలిగిన వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించమని సలహా ఇస్తున్నారు.
ఈ 10-20-30 ప్రత్యేక వ్యాయామ విధానాన్ని పొట్ట దగ్గరి కొవ్వును తక్కువ సమయంలో కరిగించేందుకు నిపుణులు తీసుకొచ్చారు. 10-20-30 సంఖ్యలు ఎంత సమయంలోగా ఏయే వర్కవుట్లు చేయాలన్న విషయాన్ని చెబుతున్నాయి. ఈ వ్యాయామం కేవలం నిమిషం పాటే చేసినా.. చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు. అయితే ఈ పద్ధతిని చేసేముందు కనీసం 5 నిమిషాలైనా తప్పనిసరి వార్మప్ చేయాలని నిపుణులు వివరించారు.
- 30 సెకన్లు: తేలికపాటి వ్యాయామాలు అంటే నెమ్మదిగా జాగింగ్ లేదా సైకిల్ తొక్కడం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
- 20 సెకన్లు: ఆ తర్వాత కాస్త వేగం పెంచి 20 సెకన్లు పరుగు తీయాలని వివరించారు. లేదా సైకిల్‌నీ కాస్త వేగంగా నడపాలని సూచిస్తున్నారు.
- 10 సెకన్లు: ఈ సమయంలో పోటీలో పాల్గొనట్లుగా పరుగు లేదా సైక్లింగ్ చేయాలని చెబుతున్నారు.
ఈ నిమిషం సమయం చేసే వ్యాయామాన్ని ఓ సైకిల్ కింద పరిగణిస్తామని నిపుణులు చెబుతున్నారు. ఇది పూర్తయ్యాక కాసేపు విరామం తీసుకుని మళ్లీ 10-20-30 వ్యాయామాల్ని తిరిగి చేయాలని వివరించారు. ఇలా వీలునుబట్టి 4-10సార్లు ప్రయత్నించొచ్చని అంటున్నారు. ప్రారంభంలో 5 వరకూ చేసి, నెమ్మదిగా కొనసాగిస్తూ వెళ్లినా మంచిదేనని సూచిస్తున్నారు.
ఉపయోగాలేంటి
సెకన్ల వ్యవధిలోనే వ్యాయామ తీవ్రతను పెంచడం వల్ల చాలా శక్తి అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే శరీరం కొవ్వు కరిగించడం ద్వారా కావాల్సిన శక్తిని తీసుకుంటుందని వివరించారు. ఇలా తక్కువ సమయంలో కెలోరీలూ తగ్గి.. కోరుకున్న ఫలితం దక్కుతుందని అంటున్నారు. అందమైన శరీర ఆకృతి కోసం ఈ సరికొత్త విధానాన్ని ప్రయత్నించాలని సలహా ఇస్తున్నారు.
డైలీ బ్రేక్ఫాస్ట్ తినట్లేదా? అయితే, మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే!