ETV Bharat / offbeat

అతి తక్కువ టైమ్​లో చేసుకునే - రెస్టారెంట్ స్టైల్ "షాహీ దమ్ ఆలూ" - టేస్ట్ నెక్స్ట్ లెవల్ అంతే!

చపాతీ, పులావ్, బిర్యానీలోకి అద్దిరిపోయే కాంబినేషన్ - ఆహా అనిపించే 'షాహీ దమ్ ఆలూ కర్రీ'!

Shahi Dum Aloo Recipe in Telugu
Shahi Dum Aloo Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 11 hours ago

Shahi Dum Aloo Recipe in Telugu : మనలో ఎక్కువ మంది బంగాళదుంపతో చేసే కూరలన్నా, వంటకాలన్నా చాలా ఇష్టంగా తింటారు. అయితే, మీరు ఆలూతో ఇప్పటి వరకు ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేసి ఉంటారు. కానీ, ఈసారి కాస్త డిఫరెంట్​గా "రెస్టారెంట్ స్టైల్ షాహీ దమ్ ఆలూ" కర్రీని ట్రై చేయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది! చపాతీ, రోటీ, పులావ్, బిర్యానీ వంటి వాటిల్లోకి మంచి కాంబినేషన్​గా నిలుస్తుంది ఈ కర్రీ. ఇంతకీ, ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బేబీ పొటాటోలు - 350 గ్రాములు
  • పెరుగు - 1 కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వేయించిన జీలకర్ర పొడి - 1 టీస్పూన్
  • పసుపు - పావుటీస్పూన్
  • ధనియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
  • గరంమసాలా - అరటీస్పూన్
  • కారం - 1 టేబుల్​స్పూన్
  • ఆయిల్ - 3 టేబుల్​స్పూన్లు
  • నెయ్యి - 1 టేబుల్​స్పూన్
  • సోంపు గింజలు - పావుటీస్పూన్
  • జీలకర్ర - పావుటీస్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్​స్పూన్
  • క్రీమ్ - 1 టేబుల్​స్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

మసాలా పేస్ట్ కోసం :

  • ఆయిల్ - 3 టేబుల్​స్పూన్లు
  • లవంగాలు - 5
  • యాలకులు - 3
  • బిర్యానీ ఆకులు - 2
  • మిరియాలు - అరటీస్పూన్
  • జీలకర్ర - అరటీస్పూన్
  • షాజీరా - అరటీస్పూన్
  • ఉల్లిపాయ చీలికలు - 1 కప్పు
  • జీడిపప్పు పలుకులు - 6
  • పెరుగు - 3 టేబుల్​స్పూన్లు
  • పచ్చిమిర్చి - 2(సన్నగా తరుక్కోవాలి)

లంచ్​ బాక్స్​ స్పెషల్​ - యమ్మీ యమ్మీ "ఆలూ రైస్"​ - ఇలా చేస్తే పిల్లలు అస్సలు వద్దనకుండా తినేస్తారు!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బేబీ పొటాటోలను మెత్తగా ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ బేబీ పొటాటోలు అందుబాటులో లేకపోతే పెద్ద సైజ్ ఆలూను ఉడికించి పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది.
  • అనంతరం రెసిపీలోకి కావాల్సిన మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, జీలకర్ర, మిరియాలు, షాజీరా వేసి కాసేపు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఉల్లిపాయ చీలికలు వేసుకొని గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. అవి వేగాక జీడిపప్పు పలుకులు వేసి కొద్దిసేపు వేయించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ఉల్లిపాయ మిశ్రమం, పెరుగు, పచ్చిమిర్చి తరుగు, కాసిన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం ఒక బౌల్​లో పెరుగు, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, గరంమసాలా, ధనియాల పొడి, పసుపు, కారం వేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకొని పక్కనుంచాలి.

దాబా​ స్టైల్​ "ఆలూ భునా మసాలా" - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

  • ఆ తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. అది వేడెక్కాక ఉడికించుకున్న బేబీ పొటాటోలను ఫోర్క్​తో గుచ్చి కాగుతున్న నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలూ వేగుతున్నప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆపై ఆలూని ఒక బౌల్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు అదే నూనెలో సోంపు గింజలు, జీలకర్ర వేసి వేపుకోవాలి. అవి వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసుకొని కలుపుతూ పైన ఆయిల్ తేలేంత వరకు వేయించాలి.
  • అలా వేయించుకున్నాక ఆ మిశ్రమంలో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని ఇందులో నుంచి కూడా నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఆ టైమ్​లో మిశ్రమం అడుగుపడుతున్నట్లనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవాలి.
  • మిశ్రమం ఆవిధంగా ఉడికిందనుకున్నాక ఒక కప్పు హాట్ వాటర్, వేయించి పెట్టుకున్న బేబీ పొటాటోలు వేసుకొని కలిపి లో ఫ్లేమ్ మీద నూనె సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందుకోసం 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టొచ్చు.
  • అలా ఉడికించుకున్నాక ఆ మిశ్రమంలో క్రీమ్, 1 టీస్పూన్ నెయ్యి, కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి చక్కగా కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "రెస్టారెంట్ స్టైల్ షాహీ ఆలూ దమ్" కర్రీ రెడీ!

లంచ్​లోకి చిటికెలో చేసుకునే "బంగాళదుంప ముద్ద కూర" - వేడి వేడి అన్నంలో తింటే అమృతమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.