Natural Remedies for Dark Circles : అందంగా, ఆరోగ్యంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే ఆ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఆరోగ్యం, అందం కోసం మన ఇంట్లో బామ్మలు, అమ్మమ్మలు ఎన్నో సహజ సిద్ధమైన టిప్స్ ఫాలో అయ్యేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ పేరుతో మనలో చాలా మంది వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ వివిధ రకాల సమస్యల్ని దూరం చేయడంలో ఈ చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.
కొబ్బరినూనెతో: ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల వివిధ రకాల ప్రయోజనాలు చేకూరతాయన్న సంగతి తెలిసిందే. కొబ్బరినూనెతో పరగడుపున పుక్కిలించడం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోవడంతోపాటు రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయని.. అలాగే చిగుళ్ల వాపు, రక్తస్రావం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. ఇదే విషయాన్ని NIH సభ్యుల బృందం కూడా స్పష్టం చేసింది.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
టీ బ్యాగులతో.. చాలా మంది డార్క్ సర్కిల్స్‌తో ఇబ్బంది పడుతుంటారు. దీంతో నలుగురిలోకీ వెళ్లాలంటే నామోషీగా ఫీలవుతుంటారు. అయితే ఇలాంటి వారు కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి తీసిన టీ బ్యాగుల్ని కళ్లపై పెట్టుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ట్యానిన్లు.. నల్లటి వలయాల్ని దూరం చేసేందుకు సహకరిస్తాయని.. తద్వారా అందంగా మెరిసిపోతారని అంటున్నారు.
ఎక్కిళ్లు తగ్గడానికి: కొంతమందికి ఎక్కిళ్లు వచ్చాయంటే ఓ పట్టాన తగ్గవు. ఇలాంటప్పుడు ఉపశమనం కోసం నీళ్లు తాగుతుంటారు. అయినా.. ఈ సమస్య తగ్గకపోతే ఒక టీ స్పూన్ పంచదారను నోట్లో వేసుకొని చప్పరిస్తే పరిష్కారం ఉంటుందని అంటున్నారు.
జుట్టు రాలకుండా ఉండటానికి: నేటి కాలంలో మెజార్టీ జనాలు జుట్టు రాలే సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. అయితే జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవాలంటే ఉల్లిగడ్డలే పరిష్కారం అంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఉల్లిగడ్డ నుంచి తీసిన రసాన్ని కుదుళ్లకు పట్టించి కాసేపు అలాగే ఉంచుకుని ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలని చెబుతున్నారు. తద్వారా జుట్టు రాలడంతో పాటు చుండ్రు సమస్యా తొలగిపోతుందని చెబుతున్నారు.
దంతాలు మెరవాలంటే: కొంతమందిలో దంతాలు పసుపు పచ్చగా కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు రోజుకో యాపిల్ తినడం మంచిదంటున్నారు నిపుణులు. యాపిల్ దంతాలపై ఉండే పసుపుదనాన్ని క్రమంగా తొలగించడంతో పాటు.. ఆరోగ్యాన్నీ అందిస్తుందని.. ఈ పండులో ఉండే ప్రత్యేకమైన సమ్మేళనాలే ఇందుకు కారణమంటున్నారు.
దుస్తులపై మొండి మరకలు పోవట్లేదా? - ఇలా ఉతికితే ఇట్టే మాయమైపోతాయ్!
సాలెపురుగులు గూళ్లు పెట్టి ఇంటిని అందవిహీనంగా మార్చాయా? - ఈ టిప్స్ పాటిస్తే ఒక్కటీ ఉండదు!