Selfie Suicide Viral Video : ఆర్థిక ఇబ్బందులు తాళలేక సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్ - A young man committed suicide financial problems

🎬 Watch Now: Feature Video

thumbnail

By Telangana

Published : Sep 1, 2023, 8:33 PM IST

Selfie Suicide Viral Video in Rangareddy District : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ సాఫ్ట్​వేర్ ఇంజినీర్​ సెల్ఫీ వీడియో తీసుకుని.. బలవన్మరణానికి (Software Engineer committed suicide ) పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీనగర్​లో.. రామచంద్రరావు నివాసం ఉంటున్నాడు. లోన్ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకున్నాడు. తిరిగి అప్పు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామచంద్రరావు.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

అంతకుముందు రామచంద్రరావు సెల్ఫీ వీడియోలో.. తల్లిదండ్రులకు గానీ, కుటుంబ సభ్యులకు గానీ ఏమీ చేయలేకపోయానని వాపోయాడు. తాను లోన్ యాప్స్ నుంచి తీసుకున్న డబ్బులు కూడా తల్లిదండ్రులు చెల్లించలేకపోవచ్చని తెలిపాడు. ఆ లోన్స్ మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశాడు. మరోవైపు తన శరీరంలోని అవయవాలు ఉపయోగపడితే.. వాటిని దానం చేయాలని కోరాడు. ఈ విషయమై కుటుంబ సభ్యులు ఎలాంటి అభ్యంతరం చేయవద్దని కోరాడు. అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.