ఇక నుంచి తిరుపతికి 8 గంటల్లోనే వెళ్లొచ్చు.. వందేభారత్ ప్రయాణికుల హర్షం - Secunderabad to Tirupati Vande Bharath Train
🎬 Watch Now: Feature Video
Secunderabad to Tirupati Vande Bharat Experience : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ప్రీతిపాత్రమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి తక్కువ ప్రయాణ కాలంతో వేగంగా వెళ్లేందుకు తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలను కలుపుతూ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వరకు ప్రయాణించే.. రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి వచ్చింది. ఆధునికి సౌకర్యాలతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తీర్చిదిద్ధిన ఈ రైలును ఎక్కేందుకు ప్రయాణికులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
సాధారణ ట్రైన్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు సుమారు 12గంటల సమయం పడితే అదే వందే భారత్లో కేవలం 8గంటలలో చేరుకోవచ్చని రైల్వే అధికారులు అంటున్నారు. సుమారు 4 గంటలు ప్రయాణ భారం తగ్గడంతో పాటు కనిష్ఠంగా రూ.1680 నుంచి గరిష్ఠంగా రూ.3030లకే ప్రయాణ ఛార్జీలు ఉండటంతో ప్రయాణికులు ఈ ట్రైన్లో ప్రయాణించడానికి పోటీ పడుతున్నారు. ఇప్పుడు మొదటి సారిగా అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో ఈటీవీ భారత్ స్పెషల్ ఇంటర్వ్యూ..