పెళ్లికి ఒప్పుకోలేదని లవర్‌పై కోపం- స్కూల్ నుంచి బయటకు రాగానే టీచర్ కిడ్నాప్ - పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై కోపం
🎬 Watch Now: Feature Video
Published : Dec 1, 2023, 10:34 AM IST
School Teacher Kidnapped In Karnataka : పెళ్లికి నిరాకరించిందని ఓ ఉపాధ్యాయురాలిని సినీఫక్కీలో కిడ్నాప్ చేశాడు ఆమె ప్రియుడు. మరో ఇద్దరితో కలిసి కారులో వచ్చి స్కూల్ గేట్ వద్ద టీచర్‌ను అపహరించాడు. ఈ ఘటన కర్ణాటక.. హసన్ జిల్లాలోని బిట్టగౌడనహళ్లిలో గురువారం జరిగింది.
ఇదీ జరిగింది..
అర్పిత, రాము గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 15 రోజుల క్రితం అర్పితను వివాహం చేసుకుంటానని అడిగాడు రాము. అందుకు అర్పిత, ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. అప్పటి నుంచి అర్పితపై రాము కోపం పెంచుకున్నాడు. దీంతో మరో ఇద్దరితో కలిసి అర్పిత స్కూల్‌కు వెళ్తుండగా కారులో వచ్చి కిడ్నాప్ చేశాడు. ఈ దృశ్యాలు పాఠశాల ముందున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
తమ కుమార్తెను రాము కిడ్నాప్ చేసి ఉంటాడని పోలీసులకు అర్పిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రాము తమకు బంధువని ఫిర్యాదులో పేర్కొన్నారు. హసన్ పోలీసులు కిడ్నాప్ కేసు ఛేదించేందుకు తీవ్రంగా కృషి చేసి.. దక్షిణ కన్నడ జిల్లాలోని నెల్యాడి సమీపంలో నిందితులను అరెస్ట్ చేశారు. అర్పితను వారి చెర నుంచి విడిపించారు.