Sand Lorry Hit Vehicles at Bhupalpalli : ఓరి దేవుడా.. ప్రమాదం ఇలా కూడా వస్తుందా..! లారీ కింద ఇరుక్కొని నరకయాతన - Lorry accident
🎬 Watch Now: Feature Video
Sand Lorry Hit Vehicles at Bhupalpalli : ప్రమాదం ఏ సమయంలో.. ఏ సందర్భంలో.. ఏ రూపంలో వస్తుందో తెలియదు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డుపై వెళ్తున్న ఓ ఇసుక లారీ.. అదుపుతప్పి ఒక్కసారిగా పక్కనే ఉన్న పార్కింగ్ వాహనాలపై దూసుకొచ్చింది. దీంతో రంజిత్ అనే వ్యక్తి లారీ కింద ఇరుక్కుపోయారు. స్థానికులు వెంటనే గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు రిస్క్యూ ఆపరేషన్ చేశారు. క్రెయిన్ తీసుకొచ్చి అతి కష్టం మీద ఆ యువకుడ్ని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సుమారు గంట వరకు ఆయన లారీ కిందనే నరక యాతన అనుభవించారు. ప్రమాదంలో పార్క్ చేసిన ఒక కారు.. మరో ఐదు బైక్లు ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి లారీ టైర్ పంక్చర్ అవ్వడమే కారణంగా తెలుస్తోంది. ఈ రిస్క్యూ ఆపరేషన్లో సింగరేణి రెస్క్యూ టీం కూడా పాల్గొన్నట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు.